నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం రామోజీ ఫిలింసిటీ పక్కన ఉన్న అనాజిపుర్ భూములను అక్రమంగా రామోజీ ఫిలిం సిటీకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ గత నెల రోజులుగా సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఆందోళనలల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని ఇటీవలనే అరెస్టు చేశారు. అక్కడ అరెస్టులు, నిర్బంధం కొనసాగుతుంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ భూమి సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
ఈ నేపద్యంలో సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అసెంబ్లీకి వెళ్తారన్న కారణంతో ముషీరాబాద్ చౌరస్తాలోని ఇంటి వద్దనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.