- Advertisement -
– రెండు వార్డులు ఏకగ్రీవం
నవతెలంగాణ – అశ్వారావుపేట
పంచాయితి ఎన్నికల్లో పోలింగ్ జరక్కుండా నే మండలంలో సీపీఐ(ఎం) రెండు వార్డులు కు బోణీ కొట్టింది. సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్ధులు నందిపాడు పంచాయితి 7 వ వార్డు కు మాడి నాగేశ్వరరావు,కోయ రంగాపురం 5 వ వార్డు కు సిచ్చొడి ముత్తమ్మ లు నామినేషన్ లు వేసారు. ఉపసంహరణ గడువుకు ఒక్కొక్కరి నామినేషన్ లు మాత్రమే ఉండటంతో ఏకగ్రీవం అయ్యాయి.
మాడి నాగేశ్వరరావు నందిపాడు మాజీ ఎంపీటీసీ గా పనిచేసారు.నూతనంగా ముత్తమ్మ ఎంపికయింది. వీరి ఇరువురిని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ లు అభినందించారు.
- Advertisement -



