- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
బీసీ రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బిసీ జేఏసీ రాష్ట్ర బంద్ కు సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డి.పోశేట్టి ఒక్క ప్రకటనలో శుక్రవారం తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ,మండలాలు, పట్టణాల్లో, ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని పేర్కొంన్నారు. ఈ ఉద్యమాల్లో బీసీ సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు చురుకుగా పాల్గొని బీసీల హక్కుల కోసం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, దిగంబర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -