న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నూతన అసెంబ్లీ నుంచి సీపీఐ(ఎం) పోటీ చేయనుంది. చంపారన్ ఉత్సవ్ భవన్‌లో ఈ నెల 29న జరిగిన సీపీఐ(ఎం) నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) నేత ప్రకాశ్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలె సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. దేశంలో మనుస్మృతిని అమలు చేయాలని, మతం ప్రాతిపదికన విద్వేష వాతావరణాన్ని, ఉద్రిక్తతలను పెంచుతూ, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కకు నెట్టాలన్నది మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఈ దేశ సంస్కృతి, నాగరికతలను రక్షించుకోవాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బీహార్ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఓడించాల్సి వుందని పిలుపిచ్చారు.