Monday, December 15, 2025
E-PAPER
Homeఖమ్మంఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) జయ కేతనం

ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) జయ కేతనం

- Advertisement -

నవతెలంగాణ – ఖమ్మం
తిరుమాలయపల్లి మండలం పెదూళ్ళచెర్వు పంచాయతీ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి ఆరెంపుల వినోద ఎన్నికయ్యారు. ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి చెరుకుపల్లి స్వాతి 126 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మల్లేపల్లి గ్రామ సర్పంచ్ గా చేర్ల రమాదేవి విజయం సాధించారు. ముదిగొండ మండలం మల్లన్న పాలెం గ్రామ సర్పంచ్ గా కోలేటి వెంకటేశ్వర్లు 62 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆరెకోడ్ గ్రామ సర్పంచ్ గా ఆరెంపుల రమాదేవి విజయం సాధించారు. ముదుగొండ మండలం చిరుమర్రి గ్రామ సర్పంచ్ గా సామినేని రాంబాబు 229 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి గొడ్డు రాంబాబు 660 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. అమ్మపేట గ్రామ సర్పంచ్ గా మేకపోతుల భద్రమ్మ 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముదిగొండ మండలం వల్లాపురంలో బాజా కవిత 350 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మోటాపురం గ్రామ సర్పంచ్ గా ఏలూరి రామారావు ఘన విజయం సాధించారు. వెలిమినేడు గ్రామ సర్పంచ్ గా బొంతల రామచంద్రారెడ్డి 311 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పొన్నెకల్లు గ్రామ సర్పంచ్ గా కోటి శ్రీనివాసరావు విజయం సాధించారు. ముదిగొండ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 934 ఓట్ల భారీ మెజారిటీతో సీపీఐ(ఎం) అభ్యర్థి కట్టకూరి ఉపేందర్ విజయ ఢంకా మోగించారు. ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి విజయం సాధించారు.

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి హరి విజయం సాధించారు. ఎం వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. ఆరెకోడు గ్రామ సర్పంచ్ గా సీపీఐ(ఎం) అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -