నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని ఈదులూరు గ్రామంలో డిసెంబర్ 11న నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు నాలుగు వార్డుల్లో పోటీ చేసి మూడు వార్డుల్లో ఘనవిజయం సాధించారు. ఒక వార్డులో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు ఆదివారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. అనంతరం అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాడతామని ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గ్రామంలో స్థానిక సమస్యలపై, తాగునీరు, డ్రైనేజీ, విద్యా, సిసి రోడ్లు మెరుగుపరచడం ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటామని చెప్పారు.
ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు తమ గెలుపు కోసం కృషిచేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మురారి మోహన్, గుడుగుంట్ల రామకృష్ణ,వార్డు మెంబర్ దండేంపల్లి శ్రీనివాస్, మురారి సైదమ్మ,శాఖ కార్యదర్శి లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ పున్న ఆగయ్య, మాజీ వార్డు మెంబెర్ నల్లబోలు విజయ, శాఖ సభ్యులు కర్నాటి రాములు,గుడుగుంట్ల అశోక్, సురేష్ దండేంప్లల్లి సత్తయ్య, లింగయ్య,మురారి ఉపేందర్, శ్రవణ్,వేణు ఉన్నారు.



