ఆదివాసీలను అగాం చెయ్యడం మానుకోవాలి..
టైగర్ జోన్ పేరుతో గూడెన్ని తరలిస్తే పోరాటమే..
ఆదివాసీల, గూడేల అభివృద్ధిని పట్టించుకోని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు..
పైళ్ళ అశయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు..
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం మల్యాల ఆదివాసి గూడెన్ని సీపీఐ ఎం, ఆదివాసీ సంఘం నాయకులు సందర్శించి, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరిగింద సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ తెలిపారు. మండలంలోని మాల్యల ఆదివాసీ గూడెం ఏర్పడి శతాబ్దాలు గడిచిపోయిన నేటికీ ఆదివాసీలు, గుడెలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ గూడెంలో ఎటూ చూసిన సమస్యలే తాండ విస్తున్నాయన్నారు.
పకృతి ఒడిలో జీవిస్తున్న ఆదివాసీల ఆగం చెయ్యడం కోసం కావ్వల్ టైగర్ జోన్ పేరుతో మల్యాల గూడెం ను ఖాళీ చేయించడం కోసం ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. అభివృద్ధిని చెయ్యని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను ఆగం చేసే పనులను మానుకోవాలని, లేకుంటే పోరు బాట పట్టవలిసి వస్తుందని అన్నారు.
అదే విధంగా గ్రామపంచాయతీ కార్యాలయం శిధిల వ్యవస్థలో ఉంది. తాగడానికి మంచినీళ్లు కూడా లేని దుస్థితి. పెద్దవాగు పొంగితే గ్రామస్తులకు రాకపోకలు ఆగిపోతాయని గ్రామస్తులు నాయకులకు తమ ఆవేదన చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఆ వాగు పై బ్రిడ్జి నిర్మించాలన్నారు. ఆ గిరిజన గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆ గ్రామాన్ని సందర్శించినవారిలో కనికరం అశోక్ సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి),ఆదివాసీ నాయకులు ఆత్రం రవి కుమార్,ముడితే భీమయ్య,మహేష్,రాజు,గడ్డం రాజు,దోసండ్ల వెంకటేష్,ప్రజలు పాల్గొన్నారు.