– కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి ఎమ్మెల్సీ కొమరయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రపతి ఉత్వర్వులు-2018 ప్రకారం పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను తేవాలని సూచించారు. కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ అయ్యేంత వరకు మినిమం టైంస్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలోల జవహర్ నవోదయ పాఠశాలలను మంజూరు చేయాలని సూచించారు. ఎన్‌ఈపీ-2020 అమల్లో తెలంగాణకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలోల ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను మంజూరు చేయాలని సూచించారు. డీఎడ్ లేకుండా బీఎడ్ అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు అర్హత కల్పించేలా ఎన్‌సీటీఈ మార్గదర్శకాల్లో సవరణలు చేయాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES