మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పీఆర్టీయూ నాయకులు
నవతెలంగాణ – పాపన్నపేట
సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ను బుధవారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింద న్నారు. మహాధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సైతం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ యంఇ ఓ గుర్నాథ్ ,పాపన్నపేట పాఠశాల హెచ్ ఎమ్ మహేశ్వర్ ,రాష్ట్ర అసోసి యేట్ అధ్యక్షులు అంజనాచారి,వెంకట్రామిరెడ్డి,ఉపాధ్యాయులు వెంకటేశం,అంజగౌడ్,భట్టు నాగరాజు,ప్రవీణ్, వేణుగోపాల్ రెడ్డి, నింగప్ప, కృష్ణకాంత్, మోహన్రావ్, రమేష్ శ్రీహరి, ఇందిర, రజిత తదితరులు పాల్గొన్నారు.