ముగ్గురు కూలీలు మృతి
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ బావిలోకి జారిపడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ విషాద ఘటన కొరికిశాల గ్రామ శివారులో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు(48), బండారి అభిలాష్(16)తో పాటు పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53) గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పూడిక తీత పనికి వెళ్లారు. ఈ క్రమంలో బావిపై ఉన్న క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోపలికి జారి పడింది. ఆ సమయంలో క్రేన్ వద్ద పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు దాని కింద పడిపోవ డంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందు కున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బావిలో నుండి బయ టకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యవసాయ బావిలో పడిన క్రేన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



