నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు మంజీర నదికి వచ్చిన వరదల కారణంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో 10 వేల 5 వందల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రావుతో కలిసి భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేటలోని పటేల్ చెరువు తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. తెగిపోయిన చెరువును పూడ్చడానికి రూ.27 లక్షలతో టెండర్లు పిలుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట,లింగంపేట్, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల్లో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సుమారు 10500 ఎకరాల్లో పంటలకు నష్టం సంభవించినట్టు ఆయన తెలిపారు.
పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువకు 20 చోట్ల గండ్లు పడ్డాయని వీటి మరమ్మతులు చేపట్టుటకు నామినేషన్ పద్దతిలో పనులు చేపడతామని తెలిపారు. గండ్లు ఏర్పడిన పనిని బట్టి లక్ష నుండి 5 లక్షల వరకు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించి గండ్లు పూడ్చివేసి నీటి విడుదల చేస్తామని తెలిపారు. అలాగే భారీ వర్షాల కారణంగా డివిజన్ పరిధిలో 464 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం జరిగిన నష్టం పై పరిహారం చెల్లించుటకు నివేదిక సమర్పించనున్నట్టు ఆయన వివరించారు. వారి వెంట ఆర్ ఐ మహమ్మద్ ఉన్నారు.
10వేల 5వందల ఎకరాల్లో పంట నష్టం: ఆర్డీవో పార్థసింహారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES