Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..

పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవ సాయ విస్తరణ అధికారి నాగార్జున సూచిం చారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలొ పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉందన్నారు. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురి అయ్యి పూత పిందే రాల డం, పంట ఎదుగుదల తగ్గడం గమనించామని అన్నారు. రైతులు మొక్క ఎదుగుదల కొరకు 19-19-19, 10 గ్రా.లీటరు నీటికి సూక్ష్మపోషకాలు 5 గ్రా. లీటరు నీటికి పిచికారి చేసుకోవాలని సూచిం చారు. అక్కడక్కడ మెగ్నీషియం , బోరాన్ లోపం పంటలలో కనిపించిందని వివరించారు.

మెగ్నీషి యం లోపం వలన మొక్క ముదురు ఆకులు ఎర్ర బడతయాని చెప్పారు. నివారణ కొరకు మెగ్నీషి యం సల్ఫేట్ 10 గ్రాములు. లీటరు నీటిలొ కలిపి  పిచికారి చేసుకోవాలన్నారు. బోరాన్ లోపం వలన పూత, పిందె రాలుతుందని వీటి నివారణ కొరకు బోరాక్స్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. పంట పొలంలో నీళ్లు ఆగ డం వలన కింద ఉన్న కాయలపై నల్ల మరకలు ఏర్పడి కుళ్ళు తెగుళ్లు వస్తాయాన్నారు. వీటి నివా రణ కొరకు ఎకరాకు 200 మి.లీ. ప్రొపికొనజోల్ పిచికారి చేసుకోవాలన్నారు. రసం పీల్చే పురుగు లు, తామర పురుగు, పచ్చ దోమ పంటలపై ప్రభా వం ఉండన్నారు. నివారణ కొరకు ముందుగా వేప నూనె 5 మి.లీ. అజాడిరక్టిన్ 1500 పి. పి. ఎమ్. మందు లీ. నీటికి కలిపి పిచికారి చేసుయాలన్నారు.

పచ్చదోమ, పేనుబంక నివారణ కోసం ప్లోమి కామిడ్ 0.3 గ్రా. లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని చెప్పారు. తామర పురుగు నివారణ ఎస్టామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచి కారి చేయాలని అన్నారు. మధ్య మధ్యలో వేప నూనె పిచికారీ చేయాలన్నారు. దాంతోపాటు నీలి, తెలుపు, పచ్చని చిగురటలు పొలంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సమ్మర్ధవంతంగా రసం పీల్చే పురుగులను నివారించి రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad