Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయాదాద్రి దేవాలయ నిర్మాణంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం

యాదాద్రి దేవాలయ నిర్మాణంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం

- Advertisement -

శాసనమండలిలో తీన్మార్‌ మల్లన్న

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ : యాదాద్రి దేవాలయ నిర్మాణంలో కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. శుక్రవారం శాసనమండలి సమావేశంలో ఆయన ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. పొరుగుసేవల ప్రాతిపదికన అధికారిని నియమించి ఆయన ద్వారా రూ.1,300 కోట్లకు టెండర్‌ పిలిచారని ఆయన తెలిపారు. రూ.17 లక్షల కోట్ల కాంట్రాక్ట్‌ ఒప్పందానికి బదులుగా 27 రెట్లు అధికంగా రూ.4.78 కోట్లు, రూ.25 లక్షలయ్యే మరో పనికి రూ.3.96 కోట్లు, రూ.51 కోట్లయ్యే పనికి రూ.145 కోట్లు, అదే విధంగా మరో పనికి రూ.129 కోట్లు ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు ఇచ్చి రూ.1,300 కోట్లకు తప్పుడు లెక్కలు చూపించారని విమర్శించారు.

సమాచార హక్కు చట్టం ద్వారా తాను సేకరించిన వివరాలను ఆయన శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలనీ, సభా సంఘాన్ని నియమించాలని విజ్ఞప్తి చేశారు ఆటో జేఏసీ డిమాండ్లను బీఆర్‌ఎస్‌ శాసనమండలిపక్ష నేత మధుసూదనాచారి, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి జీతాలు ఆలస్యమవుతున్నాయని టీచర్‌ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జగిత్యాల కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకోవాలని ఎల్‌.రమణ పిటిషన్లు సమర్పించారు. సంచార జాతులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నవీన్‌ కుమార్‌ రెడ్డి, 2004కు ముందు నోటిఫికేషన్‌తో ఎంపికైన 2003 డీయస్సీ టీచర్లకు ఓపీఎస్‌ ను వర్తింపజేయాలని సభ్యులు శ్రీపాల్‌ రెడ్డి పిటిషన్లు సమర్పించారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -