Tuesday, July 15, 2025
E-PAPER
Homeఖమ్మంపప్పు ధాన్యాలు సాగుతో ఆహారభద్రత, పోషక పదార్ధాలు లభ్యం

పప్పు ధాన్యాలు సాగుతో ఆహారభద్రత, పోషక పదార్ధాలు లభ్యం

- Advertisement -

– ఏడీఏ పెండ్యాల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పప్పు ధాన్యాలు సాగుతో ఆహారభద్రత పాటు, వీటిని ఆహారపదార్ధాలలో వినియోగించడం వలన పోషక పదార్ధాలు లభిస్తాయని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెండ్యాల రవికుమార్ తెలిపారు. జాతీయ ఆహార భద్రత పధకం, పోషణ మిషన్ – 2025లో భాగంగా మంగళవారం మినుము మినీ కిట్స్ ను స్థానిక రైతు వేదికలో  రైతులకు ఆయన అందించారు.

ఈ పథకం పప్పు ధాన్యాల సాగు పెంచి,అధిక దిగుబడి పొంది రైతులు పప్పు ధాన్యాల సాగుకు మళ్ళించడానికి ఉపయోగపడుతుంది,ఆసక్తి కల రైతులు పట్టా జిరాక్స్,ఆధార్ జిరాక్స్ తో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించి మినీ కిట్స్ పొందాలని కోరారు.

అశ్వారావుపేట,ములకలపల్లి మండలాల్లో వాన కాలంలో మినుము సాగు చేసే ఆనవాయితీ ఉంది అని,వేరుశనగ మొక్కజొన్న సాగు కు ముందు మినుము సాగు చేయవచ్చు అని,లేత ఆయిల్ ఫామ్ తోటల్లో మినుము సాగుకు అనుకూలం ఉంటుందని,మినుము స్థానిక అవసరాల కోసం రైతులు సాగు చేయడం లాభదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.శివ రామ ప్రసాద్,ఏఈఓ సతీష్, రవీంద్ర రావు లు పాల్గొన్నారు. రైతులు చిలుకూరి రాంబాబు,ధర్ముల చిన మల్లయ్య,రాజబాబు, రామకృష్ణ,జోగమ్మ,వంకుడోత్ రవి,శోభన్ బాబు,భూక్యా ప్రసాద్ విత్తనాలు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -