Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెండు గ్రామాలకు సంబంధాలు కట్ 

రెండు గ్రామాలకు సంబంధాలు కట్ 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
రెండు గ్రామాలకు సంబంధాలు కట్ అయినట్టు ఇరు గ్రామాల ప్రజలు తెలిపారు. మండలంలోని పద్మాజి వాడి కల్వరాల్ గ్రామాలలో రెండు గ్రామాల రాకపోకలు బంద్ అయినాయి. భారీ వర్షాలకు రెండు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు పూర్తిగా కోట్టుకపోవడంతో నిర్మించిన బ్రిడ్జి మాత్రమే ఉండిపోయినది. పద్మాజివాడి నుండి కల్వరాలకు వెళ్లే బ్రిడ్జి పక్కన రోడ్డు భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకపోవడంతో రెండు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వరాల్ గ్రామస్తులు పద్మాజి వాడి రావాలన్న పద్మాజివాడి ఎక్స్ రోడ్ రావాలన్న ఆ గ్రామంలోని  కల్వరాల్  44వ జాతీయ రహదారి  ద్వారా పద్మాజి వాడికి కానీ పద్మాజివాడి  ఎక్స్ రోడ్ కు కానీ రావాల్సి ఉంటుంది. ఈ రెండు గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన బ్రిడ్జి రోడ్  రెండు గ్రామాలకు రోడ్డు రాకపోకలకు సులభంగా ఉపయోగపడేది.

భారీ వర్షాల వల్ల రోడ్డుకు రోడ్డు మట్టి పూర్తిగా కొట్టుకోపోవడంతో రాకపోకలు  ఆగిపోయింది గ్రామస్తులకు పద్మాజి వాడి నుండి పోవడానికి  దూరం తక్కువగా ఉంటుందని తెలిపారు .ప్రస్తుతం కల్వరాల్ గ్రామానికి వెళ్లాలంటే 44వ జాతీయ రహదారిపై వెళ్లి గ్రామానికి వెళ్ళవలసి పరిస్థితి ఉంది .వాహనాలు అతివేగంగా రావడంతో  ఆ గ్రామానికి రోడ్డు దాటవలసి ఉంటుంది .గతంలో పద్మాజివాడి  గ్రామం నుండి పోతే చాలా సేఫ్ గా ఉండేవారమని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు రోడ్డుతో పాటు రెండు గ్రామాల మధ్య తారు రోడ్డు వేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నారు. తారు రోడ్డు వేయకముందే రోడ్డు కొట్టుకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  మధన్ మోహన్ స్పందించి రెండు గ్రామాల మధ్య రోడ్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad