నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో గురువారం సైబర్ క్రైమ్స్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎజిఎం (బిఓ) ఎల్ హెచ్ ఓ హైదరాబాద్ ప్రశాంత్ కుమార్, చిప్ మేనేజర్ సోమేశ్వర రావు, రామకృష్ణ పాల్గొన్నారు. సంస్థలో శిక్షణ తీసుకుంటున్న టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వర్క్ శిక్షణ తీసుకుంటున్న శిక్షణార్థులతో సైబర్ క్రైమ్స్ పై క్లుప్తంగా వివరిస్తూ ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి దీనివలన సాధారణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు.
కొన్ని రకాల సైబర్ క్రైమ్స్ లో గూరించి తెలిపారు. ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురితే 1930 అనే నెంబర్ కి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ అనేది మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్లో ద్వారానే ఎక్కువ జరిగే అవకాశం ఉన్నదని, మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వీలైనంతవరకు వ్యక్తిగత సమాచారం మన తోటి వారితోనే చెప్పకపోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి టి డైరెక్టర్ రవికుమార్, సిబ్బంది రామకృష్ణ, నవీన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, స్వరూప, రాధిక, సౌమ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



