- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే తూర్పు గోదావరి, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో 27, 28, 29న, కడపలో 27, 28 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు.
- Advertisement -



