నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియాలో మొంథా, కరేబియన్ దీవుల్లో మెలిస్సా తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నాయి. మొంథా ప్రభావంతో భారత్ తీర ప్రాంతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరు ప్రాంతంలో తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. బలమైన గాలుల ధాటికి చెట్లు, కరెంట్ స్తంభాలు, పలు ఇండ్లు నేల కూలిపోయాయి.
ఈక్రమంలోనే తాజాగా కరీబియన్ దీవుల్లో అత్యంత శక్తివంతమైన మెలిస్సా తుపాన్ విరుచుకుపడుతోంది. 295 కిలోమీటర్ల వేగంతో గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. జమైకా గుండా క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబా వైపు దూసుకెళ్తోంది. అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఇక ఈ తుఫాను ధాటికి ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జమైకాలో ముగ్గురు, హైతీలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్‌లో ఒకరు చొప్పున మరణించారు. బ్లాక్ నదిలో మూడు కుటుంబాలు తమ ఇళ్లలో చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని రక్షించేందుకు కూడా వీలు పడలేదు. సిబ్బంది వారిని చోరుకోలేకపోతున్నారని పేర్కొంది. దాదాపు 15 వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అధికారులు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మెలిసా హరికేన్‌ను అయిదో కేటగిరీ తుఫాన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.



