- Advertisement -
నవతెలంగాణ వరంగల్: ముంథా తుఫాను ప్రభావంతో బుధవారం కురిసిన భారీ వర్షాలకు దర్గా శౌరి నగర్ లో నర్సింగ్ కళాశాల గోడ కూలి విద్యుత్ స్తంభంపై పడటంతో ఆ విద్యుత్ స్తంభం పక్కనే ఇంటిపై పడి ప్రమాదకరంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల నర్సింగ్ కళాశాలలోని వరద నీరంతా పక్కనే ఉన్న ఇండ్లల్లోకి చేరి నిత్యవసర వస్తువులు, పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి. మట్టి చేరి అస్తవ్యస్తంగా మారాయి. ఇంట్లోకి చేరిన వరదనీటిలో పడి అడప కృష్ణమూర్తి అనే వృద్ధుడు మృతి చెందాడు.




- Advertisement -



