నవతెలంగాణ – మద్నూర్: అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డి. జయశ్రీని దన్నూరు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో గురువారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు మాట్లాడుతూ.. ధన్నూరు గ్రామం అభివృద్ధి కావాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డి జయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని గ్రామస్తులను కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని గ్రామ అభివృద్ధికి లక్షలాది నిధులు మంజూరు చేశారని రాబోయే రోజుల్లో గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి గెలవాలని ప్రజలు అర్థం చేసుకొని గ్రామ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం జయశ్రీని గెలిపించుకోవాలని కోరారు.
డి. జయశ్రీ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



