- Advertisement -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12
న్యూఢిల్లీ : దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన క్వాలిఫయర్-1లో పుణెరి పల్టాన్‌పై 6-4తో టైబ్రేకర్‌లో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత 40 నిమిషాల ఆటలో పుణెరి పల్టాన్, దబంగ్ ఢిల్లీ 34-34తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను టైబ్రేకర్‌లో తేల్చారు. దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), ఆషు మాలిక్ (4 పాయింట్లు) రాణించగా.. పుణెరి పల్టాన్ నుంచి ఆదిత్య షిండె (10 పాయింట్లు), పంకజ్ మోహితె (5 పాయింట్లు) మెరిశారు. అంతకుముందు ఎలిమినేటర్2లో బెంగళూరు బుల్స్‌పై 46-37తో పట్నా పైరేట్స్ గెలుపొంది ఎలిమినేటర్3కు చేరుకుంది.
- Advertisement -



