నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేస్తున్న దినసరి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 18 వ రోజుకు చేరుకుంది. సోమవారం డైలీ వేస్ వర్కర్స్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తమ డిమాండ్ లను ప్రభుత్వానికి తెలియ పరచాలని కోరుతూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బత్తుల శ్రీను, సీఐటీయూ నాయకులు మురహరి రఘు మాట్లాడుతూ దినసరి కార్మికులు గిరిజన ఆశ్రమ వసతి గృహాలలో ఎంతోకాలం నుండి పేద పిల్లలకు వంట నిర్వహణ చేసి పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 64 ను తీసుకొచ్చి రూ.11 వేల రూపాయలు వేతనం తీసుకోవాలి అని చెప్పడం ఆదివాసి కార్మికులను, బలహీనవర్గాల శ్రామికులు ను అవమానపరచడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు,నాగమణి,శ్రీను, అరుణ,దాసు,అప్పారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జారెకు దినసరి కార్మికుల వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



