Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత బంధు నిధులు విడుదల చేయాలి

దళిత బంధు నిధులు విడుదల చేయాలి

- Advertisement -

కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – చారకొండ

దళిత బంధు రెండవ విడత నిధులు మంజూరు చేయాలని మండలానికి చెందిన పలు గ్రామాల లబ్ధిదారులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టీ , మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటి విడత నిధులు మంజూరు చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండో విడత విడుదలైన నిధులు మంజూరు జాప్యం జరిగిందనీ అన్నారు. చారగొండ మండలంపై దృష్టి సారించి 279 లబ్ధిదారులకు ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసి యూనిట్లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శంకర్, నరేష్, హరీష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -