నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలోగల దళితవాడలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను వెంటనే శుభ్రం చేయాలని కెవిపిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దళితవాడలోని డ్రైనేజీ వ్యవస్థను కెవిపిఎస్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థ చెత్తాచెదారం పిచ్చి మొక్కలతో మురుగునీరు పోకుండా నిలువ ఉండి దుర్వాసన వేస్తోందని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజానీకానికి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అన్నారు. మలేరియా డెంగు వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మురళి డిమాండు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలన పేరుతో మాయమాటలు చెబుతూ ప్రజాసమస్యలు పట్టించుకోవడంలేదని మురళి ద్వజమెత్తారు. ఓట్లప్పుడూ మాత్రమే ప్రజలు గుర్తుకువస్తారని, దళితులను వారి పాలెరులుగా వాడుకుంటున్నారని మండి పడ్డారు. కాంగ్రస్ పాలనలో దళితులకు ఒరిగిందేమి లేదని, కాంగ్రస్ పాలన లో మాబ్రతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం తెలియజేశారు. ఓట్ల కోసం దళిత వాడల కు వస్తే కాంగ్రెస్ పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెమిని రవి, బిక్షపతి, శ్రీరామ్, పులి, మహేష్, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.
దళితవాడ డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రం చేయాలి: కేవీపీఎస్
- Advertisement -
- Advertisement -