Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ పాల‌న‌లో ద‌ళితులకు ర‌క్ష‌ణ లేదు:ఎంపీ ప్రియాంక గాంధీ

బీజేపీ పాల‌న‌లో ద‌ళితులకు ర‌క్ష‌ణ లేదు:ఎంపీ ప్రియాంక గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉన్న‌త స్థానంలో ఉన్నా బీజేపీ పాల‌న‌లో ద‌ళితులకు ర‌క్ష‌ణ లేద‌ని ఎంపీ ప్రియాంకా గాంధీ మండిప‌డ్డారు. ఈనెల అక్టోబ‌ర్ 7న సీనియ‌ర్ అధికారులు కులం పేరుతో తీవ్రమైన‌ వేధింపుల‌కు గురి చేశార‌ని త‌న‌కుతాను స‌ర్వీస్ గ‌న్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు ఐపీఎస్ వై పూర‌న్ కుమార్. దీంతో చండిఘ‌డ్‌లో ఉన్న‌ ఐపీఎస్ కుటుంబాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ వెళ్లి ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళితులు ప్ర‌భుత్వ రంగంలో ఉన్న‌త స్థానంలో ఉన్న వారికి ర‌క్ష‌ణ లేద‌ని, వారి ప‌ట్ల అధికార ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా ఉంద‌ని, బాధిత కుటుంబానికి న్యాయం అందించ‌డానికి త‌గ్గిన చ‌ర్య‌లు తీసుకుంట‌లేద‌ని ఆమె వాపోయారు. ఈ త‌ర‌హా సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం బీజేపీకి సిగ్గుచేట‌ని, ఐపీఎస్ కుటుంబం స‌రైన న్యాయం కోసం పోరాటం చేస్తుంద‌ని ప్రియాంక‌ గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

https://aninews.in/news/national/politics/people-from-dalit-community-not-safe-such-events-blot-on-country-priyanka-gandhi-on-haryana-ips-officer-suicide-case20251014142908
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -