Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి

దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ధ్యారపోగు వెంకటేష్ 
నిర్విన్ లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం
నవతెలంగాణ – వనపర్తి

దళితులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని, సమాజంలో చైతన్యం కలిగిన వారంతా వారికి సహకరించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ద్యారపోగు వెంకటేష్ అన్నారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తకోట మండల్ నిర్విన్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వనపర్తి జిల్లా పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యారపోగు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి నెలా చివరి రోజున పౌర అక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దని సూచించారు. పౌర హక్కులకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుల వివక్ష అంటరానితనాన్ని నిర్మూలించాలని అన్ని కులాలు వర్గాల వారు సోదరా భావంతో మెలగాలని సూచించారు. పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని బడి గుడి అందరికీ సమానమేనని ఎవరైనా పోవచ్చు అని తెలిపారు. పిల్లలు పాఠశాలలోనే ఉండాలని, పిల్లలను పనుల్లో పెట్టినా, పెట్టుకున్నా కేసులు నమోదు చేస్తామని సూచించారు. గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరుపుకొని ప్రజల్లో చైతన్యం తేవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎడవల్లి వీరప్ప, మాదారి భోజరాజు చింతకుంట విశ్వ బాబు చిట్యాల వెంకటేష్ కమ్మర్ రెహమాన్ గారు వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -