Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నల్లచెరువు బండ్ సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్

నల్లచెరువు బండ్ సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం 
నవతెలంగాణ – వనపర్తి

జిల్లా కేంద్రంలోని నల్లచెరువు బండ్ పై సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సామాగ్రిని, మొక్కలను సంరక్షించడంలో విఫలమయ్యారని మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంకుబండుతో పాటుగా, ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నల్లచెరువు ట్యాంక్ బండ్ పై సుందరీకరణ పనుల్లో భాగంగా చేయించిన ఏర్పాట్లను వస్తు సామాగ్రిని స్వయంగా పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై సరైన నిర్వహణ లేక కొద్ది కాలం క్రితం నాటిన మొక్కలు కూడా ఎండిపోయి కనిపించడంతో మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వనపర్తి లైటింగ్ బోర్డు, ఇతర వస్తువులు సైతం పగిలిపోయి కనిపించడంతో వస్తువులను ఏర్పాటు చేయడమే కాదు వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత అంటూ అసహనం వ్యక్తం చేశారు.

వెంటనే వాటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాలని, మొక్కలను సైతం తిరిగి నాటించేలా కాంట్రాక్టర్ కు సూచించాలని కలెక్టర్ ఆదేశించారు. ట్యాంక్బండ్ కి ఇరువైపులా ఆర్చితోపాటు గేటు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలస్యం చేయకుండా ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తిరిగి మొక్కలు నాటిన అనంతరం మొక్కలు పాడవకుండా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

 ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇండోర్ స్టేడియం
జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో కలెక్టర్ తన సొంత నిధులతో పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేయించిన వుడెన్ షటిల్ కోర్ట్, జిమ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధం అయిన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిమ్ సెంటర్, వుడెన్ షటిల్ కోర్టును కలెక్టర్ పరిశీలించారు. ఆడుకోవడానికి వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాడమీ విద్యార్థులకు డైలీ ఒక గంట సమయం ఆడుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. ఈ తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -