• మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్
• కొరిపల్లి లో పంటలను పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ -పెద్దవంగర
మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల వివరాలను రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కొరిపల్లి గ్రామంలో నేలకొరిగిన వరి, మొక్క జొన్న పంటలను ఏవో, ఏఈవో యశస్విని తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరిస్తున్నామని తెలిపారు. నష్టం వాటిల్లిన రైతులు తమ పంటల వివరాలను సంబంధిత ఏఈవో ల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. రైతులు అధైర్య పడొద్దని, వీలైనంత త్వరగా వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని కోరారు.
దెబ్బతిన్న పంటలను నమోదు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



