Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చీకటి కోణం..ఓటుకు బాణం

చీకటి కోణం..ఓటుకు బాణం

- Advertisement -

పగలు ప్రచార పథం
రాత్రిళ్లు ప్రలోభాల పర్వం
నవతెలంగాణ – మల్హర్ రావు

గెలుపువేటలో అభ్యర్థులు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. పొద్దంతా ప్రచారం సాగించి..పొద్దుగుకితే చాలు మందు, విందు లతో ముంచేస్తున్నారు. పోలీసులు ఎంతా నిఘా పెట్టినప్పటికీ.. అధికారులు నిబంధనల కొరడా ఝలిపిస్తున్నప్పటికీ డబ్బుల పంపిణీ..మద్యం సీసాల గలగలకు అడ్డూ అదుపు లేకుండా పోతంది. గెలవాలంటే ఇదే ప్రధానమని బాహాటంగానే చెబుతున్నారు.ఎన్నికల ఆరంభం నుంచే ప్రచారంలో జనాలను తమ చుట్టూ తిప్పుకొనేందుకు అభ్యర్థులు రోజువా రీగా వారికి మద్యం, డబ్బులు అందిస్తున్నారు.పగలంతా సాధారణంగా ప్రచారంలో కనిపించే నాయకులు రాత్రి అయ్యే సరికి అడ్డాలు ఏర్పాటు చేసుకొని గ్రూపులుగా ఏర్పడి డబ్బులు,మద్యం పంపిణీ చేస్తున్నారు.

సాధారణంగా మద్యం దుకాణాల వద్ద సివిల్ దుస్తుల్లో పోలీసులు నిఘా పెద్ద వేసి ఉంచారు..పెద్దయెత్తున మద్యం తరిలితే అది ఎక్కడికి చేరుతుందో తెలుసుకొని పట్టుకోవడం వారి బాద్యత. గ్రామాల్లో కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు.అయినప్పటికీ దొడ్డిదారుల్లో పెద్ద ఎత్తున గ్రామాలకు మద్యం తరలిస్తు న్నారు. మద్యం ప్రియులను ఖుషీ చేసి ఎన్నికల రోజు వరకు ఓటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.కొంత మంది ముందుగానే వైన్బీషాపులతో మాట్లాడుకొని చిట్టీల రూపంలో నేరుగా ఓటర్లను దుకాణాలకు పంపిస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఇప్పటిదాకా ఎక్కడా పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న దాఖలు, డబ్బులు దొరికిన దాఖలాలు గానీ లేవు. అభ్యర్థుల ఆట ముందు పోలీసుల మద్యం, డబ్బుల వేట చిన్నబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -