Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సలహా కమిటీ సభ్యులుగా దరువు ఎల్లన్న..

సలహా కమిటీ సభ్యులుగా దరువు ఎల్లన్న..

- Advertisement -

-హర్షం వ్యక్తం చేసిన ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ – బెజ్జంకి
: ప్రభుత్వ పథకాలు, సామాజిక మరియు సాంస్కృతిక సమస్యలపై ప్రభుత్వం సలహా కమిటి ఏర్పాటుచేసి సాంస్కృతిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సలహ కమిటీ సభ్యులుగా దరువు ఎల్లన్న నియామకమవ్వడంతో సోమవారం మండలంలోని పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

యువత శక్తులకు ప్రాధాన్యత: దరువు ఎల్లన్న 
నిర్మాణాత్మకమైన కార్యకలపాల్లో యువత శక్తులకు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చి అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సలహా కమిటీ ఏర్పాటు చేసిందని దరువు ఎల్లన్న తెలిపారు.సామాజిక దురాచారాలు,చెడు పద్ధతులపై చర్చించడానికి సంస్కృతి,కళ మరియు సాహిత్యం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి చర్యలు మరియు వ్యూహాలను సూచించడానికి సలహా కమిటీ సభ్యులందరం శాయశక్తుల పని చేస్తామని ఎల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు.సలహా కమిటీ సభ్యులు నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎమ్మెల్సీ మరియు సలహా కమిటి చైర్మన్ ప్రో.కొదండ రాంకు ఎల్లన్న కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img