Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాశరథి సాహిత్య వారసత్వాన్ని కొనసాగించాలి

దాశరథి సాహిత్య వారసత్వాన్ని కొనసాగించాలి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
దాశరధి కృష్ణమాచార్య సాహిత్య వారసత్వాన్ని కొనసాగించినప్పుడే  ‌తెలంగాణ తీరుతెన్నులను మార్చగలమని, సాహితీవేత్తలు ప్రజల పక్షం నిరంతరం పోరాటం సాగించాలన్నది ప్రజా కవి దాశరథి జీవితం నేర్పే గొప్ప పాఠమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. మంగళవారం రాత్రి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మహాకవి దాశరథి శత జయంతి ఉత్సవ సభలో ఆయన మాట్లాడారు. దాశరధి శత జయంతి సంవత్సరం వేళ కవులు రచయితలు దాశరథిని అధ్యయనం చేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో  బొగ్గు ముక్క రాసిన ప్రేమ లేఖ అనే కవితను వినిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసన మండల సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఘనపురం దేవేందర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాకవి దాశరథి తనయుడు దాశరథి లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్, తెలంగాణ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రముఖ కవి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ వజ్జల శివకుమార్, రామోజు హరగోపాల్, డాక్టర్ కాంచనపల్లి, రంగు నవీనాచారి, మౌనశ్రీ మల్లిక్, ఒద్దిరాజు ప్రవీణ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -