Thursday, July 3, 2025
E-PAPER
Homeజిల్లాలు2026 మేడారం మహా జాతర తేదీలు ఖరారు..

2026 మేడారం మహా జాతర తేదీలు ఖరారు..

- Advertisement -

పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు
నవతెలంగాణ – తాడ్వాయి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర గా పేరుగాంచిన సమ్మక్క – సారలమ్మ మహా జాతర 2026 లో జరగబోయే తేదీలను పూజారుల సంఘం ఖరారు చేసింది. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమై 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగబోయే తేదీలను ప్రకటించారు. 

2026 జనవరి 28 బుధవారం సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుండి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుండి గోవింద రాజు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం (గంగారం) మండలం పూనగల్లు గ్రామం నుండి పగిడిద్ద రాజు లు గద్దెలకు చేరుకుంటారు. 2026 జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క వనదేవత చిలకలగుట్ట నుండి ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నివాసి సాంప్రదాయ పద్ధతిలో గద్దెకు చేరుకుంటారు. 

2026 జనవరి 30 శుక్రవారం భక్తులు తమ మొక్కుబడులను సమర్పించుకుంటారు. 2026 జనవరి 31 శనివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశం తో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని పూజారులు తెలిపారు.  పూజారుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం అధికారికంగా జాతర నిర్వహణాధికారులు పరిశీలించి సమీక్షించనున్నారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విచ్చేస్తారు. దీంతో ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -