Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆలయ్ బలయ్ కు వీహెచ్‌ను ఆహ్వానించిన దత్తాత్రేయ

ఆలయ్ బలయ్ కు వీహెచ్‌ను ఆహ్వానించిన దత్తాత్రేయ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
దసరా పండుగ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు లక్ష్మణ్‌ యాదవ్‌, నారాయణస్వామి, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి శుంబుల శ్రీకాంత్‌ గౌడ్‌ రామ్మోహన్‌ గడ్డం శ్రీధర్‌ గౌడ్‌, జహంగీర్‌, సి. సుధాకర్‌ తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -