Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడేవిడ్‌ రెడ్డి రూటే సపరేటు..

డేవిడ్‌ రెడ్డి రూటే సపరేటు..

- Advertisement -

మంచు మనోజ్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్‌ రెడ్డి’. వెల్వెట్‌ సోల్‌ మోషన్‌ పిక్చర్స్‌, ట్రూ రాడిక్స్‌ బ్యానర్స్‌పై వెంకట్‌రెడ్డి, భరత్‌ మోటూకురి నిర్మిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకుడు. ఇందులో మారియార్యబోషప్క హీరోయిన్‌గా నటించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రూపొందుతున్న ఈచిత్ర గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌ బుధవారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ,’మనోజ్‌ని మీరు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఇప్పుడు గ్లింప్స్‌లో చూసింది ఒక పర్సెంట్‌ కూడా కాదు. సినిమా అంత బాగుంటుంది. డైరెక్టర్‌ హనుమ నా ఫ్రెండ్‌. ఒక కసితో ఈ సినిమాని తెరకెక్కించాడు’ అని తెలిపారు.

‘ఈ సినిమాని కేవలం మనోజ్‌ మాత్రమే చేయగలరు. అనేక ఇబ్బందులు పెట్టిన తరువాత ఒకరి నుంచి పుట్టుకొచ్చే ఆవేశమే ఈ సినిమా. ఆ ఆవేశమే బ్రిటీష్‌ వారి మీద తిరగబడేలా చేసింది’ అని మరో నిర్మాత భరత్‌ మోటుకూరి చెప్పారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా కూడా మ్యూజిక్‌పరంగా మీ అందరికీ ఫేవరేట్‌ అవుతుంది. ఈ సినిమా గ్లింప్స్‌లో మీరు చూసింది చాలా కొంతే. మూవీలో మరింత మంచి కంటెంట్‌ చూస్తారు’ అని తెలిపారు. ”భైరవం’ సినిమా చూసి మనోజ్‌ని కలవాలని ఒక చిన్నపోస్టర్‌ని పంపించాను. ఆ పోస్టర్‌ చూసి వెంటనే కాల్‌ చేశారు. కథ విన్న వెంటనే మనం సినిమా చేస్తున్నామని చెప్పారు. మనకి ఒకరే భగత్‌సింగ్‌, ఒకరే సుభాష్‌ చంద్రబోస్‌, ఒకరే డేవిడ్‌ రెడ్డి. ఇది నిజమైన పాన్‌ ఇండియా సినిమా. రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకుని, ఫిక్షనల్‌ క్యారెక్టర్‌తో రాసిన స్క్రిప్ట్‌ ఇది’ అని అన్నారు.

‘1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ఇది. డేవిడ్‌ రెడ్డి బ్రిటీష్‌ వారికే కాదు.. భారతీయులకు కూడా శత్రువే. డేవిడ్‌ రెడ్డికి శాంతియుతంగా ఉండటం రాదు. ఏదైనా సరే కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. డేవిడ్‌ రెడ్డి బైక్‌ పేరు వార్‌ డాగ్‌. అతని చేతిలో ఉన్న స్టిక్‌ పేరు డెత్‌ నోట్‌. ఇవి రెండు తన ఆయుధాలు. ఇండియాకి స్వాతంత్య్రం అడిగికాదు.. కొట్టి తెచ్చుకోవాలనేది డేవిడ్‌ రెడ్డి దృక్పథం. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది అనేది మా సినిమాలో చూస్తారు. నా అభిమానులకు ఇది ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా’ అని హీరో మంచు మనోజ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -