Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం

దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం

- Advertisement -

రైజింగ్‌పై మరింత దూకుడుగా ప్రచారం : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ ఏడాది దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా 2047 దార్శనీకతను, దాని క్యూర్‌, ఫ్యూర్‌, రేర్‌ ఫ్రేమ్‌ వర్క్‌ మరింత దూకుడుగా ప్రచారం చేయడానికి తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో దావోస్‌ సందర్శన సందర్భంగా అందుకున్న పెట్టుబడి ప్రతిపాదనలు, నిబద్ధతలతో పాటు తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -2025పై సమీక్షంచారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే పట్టుదలతో ముందు కెళ్లాలని సూచించారు. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా త్రిముఖంగా ఆర్థిక వృద్ధిని సాధించడానికి రాష్ట్ర పరివర్తన ప్రణాళికలను తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం వివరిస్తుందని చెప్పారు. ‘ఎ స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ అనే ఇతివృత్తంతో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశం ఈ నెల 19 నుంచి 23 వరకు జరుగనున్నది. ఏవైనా పెండింగ్‌ సమస్యలు, అడ్డంకులుంటే పరిష్కరిం చుకునేలా ఈసారి పర్యటనలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ వెలుగులో ఆర్థిక వృద్ధి సాధించుకునేందుకు పారదర్శకంగా రూపొందించుకున్న రోడ్‌ మ్యాప్‌కు బహుళ ప్రచారం కల్పించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -