– ఎస్‌ఐ వెంకటేష్‌కు విరిగిన రెండు కాళ్లు
– అంతకు ముందు కారు ఢీకొని వ్యక్తి మృతి
– బాలానగర్ ఫ్లైఓవర్‌పై వరుస ఘటనలు
నవతెలంగాణ – బాలానగర్
బాలానగర్ ఫ్లైఓవర్‌పై వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అక్కడ పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటేష్‌ను డీసీఎం ఢకొీట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ సంఘటనలు మంగళవారం జరిగాయి. సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి కూకట్‌పల్లి వైపు గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. బోయిన్‌పల్లి వైపు నుంచి వచ్చిన కారు పాదాచారుడిని ఢకొీట్టడంతో అక్కడి కక్కడే మృతిచెం దాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేష్ పంచనామా చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో బోయిన్‌పల్లి నుంచి వేగంగా దూసు కొచ్చిన డీసీఎం ఎస్‌ఐ వెంకటేష్‌ను ఢీకొట్టిం ది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే ఆయనను మాదాపూర్ యశోద ఆస్పత్రికి తరలిం చారు. బాలా నగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ నరసిం హారాజు ఎస్‌ఐని పరామర్శిం చారు. కాగా, ప్రొబేషనరీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ జూన్ 30తో ఆరు నెలల శిక్షణాకాలం ముగిసింది. జులైలో పోస్టింగ్ రానున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.
విధుల్లో ఉన్న పోలీస్‌ను ఢీకొట్టిన డీసీఎం
- Advertisement -
- Advertisement -