Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన డీసీఎం

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన డీసీఎం

- Advertisement -

తప్పిన పెను ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు
రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన


నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం షాద్‌నగర్‌ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌ వస్తోంది. ఆరాంఘర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగల్‌ పడటంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. అదే సమయంలో కర్నాటకకు చెందిన డీసీఎం వేగంగా వచ్చి వెనకనుంచి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందికి దించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డీసీఎం డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు స్పష్టం చేశారు. చేవెళ్ల ఘటన మరువక ముందే మరో ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -