Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రక్తహీనత నివారణకు డి వార్మింగ్ డే ..

రక్తహీనత నివారణకు డి వార్మింగ్ డే ..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
రక్తహీనత నివారణకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని భీంగల్ మండల వైద్యాధికారి, విద్యాధికారి అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను సోమవారం మండలంలోని అన్ని పాఠశాలలో  పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈరోజు నేషనల్ డివార్మింగ్ (NDD) రోజు సందర్భంగా భీంగల్ మండలంలోని అన్ని పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలు పి హెచ్ సి సెంటర్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. భీంగల్ మండలంలోని ప్రభుత్వ, అన్ని ప్రైవేట్ పాఠశాలలో, కాలేజీలలో ఈ మాత్రాలను పంపిణీ చేశారు. జడ్పీహెచ్ఎస్ భీంగల్ పాఠశాలలో భీంగల్ మండల వైద్యా అధికారి డా. అజయ్ పవర్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి అజయ్ పవర్ మాట్లాడుతూ… నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాలు లోపం, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. ఆల్ బెండజోల్ మాత్ర వేయడం ద్వారా రక్త హీనత నివారణ, పోషకాలు గ్రహించడం జరుగుతుందని తద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.అందుకని ఈ మాత్రలను మొదటి సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలు తప్పకుండా తీసుకోవాలని భీంగల్ మండల వైద్యాధికారి డా. అజయ్ పవర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి స్వామి, ఉపాధ్యాయులు జాన్ విల్సన్, షఫీ, రమణ, వాసుదేవ్, భూమేశ్వర్, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సత్య రమేష్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img