Sunday, September 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్  : నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు సోమవారం తెలిపారు. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నిజామాబాద్ గంజిలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయి అనే సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నామన్నారు. అతని వయసు సుమారు 35నుండి 40 ఉంటుంది. మృతి చెందిన వ్యక్తి బట్టలు స్కై బ్లూ రంగు టీ షర్టు,నేవీ బ్లూ రంగు ప్యాంట్ వ్యక్తి వాలకం బట్టి కూలి పని చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది.  ఇతని జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712659839.
8712551734 లకు సమాచారం ఇవ్వాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -