- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాక్ వైమానిక దాడుల్లో అఫ్గానిస్థాన్‌కు చెందిన స్థానిక క్రికెటర్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. వారి అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. కన్నీటితో స్థానికులు వీడ్కోలు పలికారు. బంగారు భవిష్యత్తు ఉన్న క్రీడాకారులు అకారణంగా మరణించడంతో ప్రజల ముఖాలు విషాదంతో నిండిపోయాయి. గుండెలను పిండేసే ఈ దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
- Advertisement -