Monday, September 15, 2025
E-PAPER
Homeఖమ్మంప్రేమ పేరుతో వంచ‌న‌..యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

ప్రేమ పేరుతో వంచ‌న‌..యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి కోళ్లపూడి రమ్య వైజాగ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన నరేష్ అనే పెండ్లి అయిన వ్యక్తితో ప్రేమ పేరుతో ఆమెను వైజాగ్ తీసుకెళ్లాడు. పదిహేను రోజుల తర్వాత యువతిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. రమ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించక పోవటంతో ఆందోళనకు గురైంది. వైజాగ్ లోనే లాడ్జీలో ఉరి వేసుకుని బలవన్మారణానికి పాల్ప‌డింది. యువ‌తి గ‌దిలోనే సూసైడ్ నోట్ రాసి చ‌నిపోయింది. త‌న చావుకు నరేష్ కార‌ణ‌మ‌ని, అత‌ని వ‌ద‌లొద్ద‌ని త‌న తండ్రిని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -