– ‘ఎక్స్’ను ఆదేశించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– ఇందులో 70 శాతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచే..: రాయిటర్స్ వెల్లడి
న్యూఢిల్లీ : పలు పోస్టులు, ఖాతాల తొలగింపు విషయంలో భారత్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్'( ఒకప్పుడు ట్విట్టర్)కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు నోటీసులు అందాయి. దాదాపు 1400 పోస్టులు, ఖాతాలను తొలగించాలంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వివరించింది. ఈ ఆదేశాలు మార్చి 2024 నుంచి జూన్ 2025 మధ్య ఎక్స్‌కు అందాయని పేర్కొన్నది. తొలగింపు నోటీసులు అధికంగా 70 శాతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో పని చేసే సైబర్‌క్రైమ్ సమన్వయ కేంద్రం నుంచే ఉన్నాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సైబర్‌క్రైమ్ సమన్వయ కేంద్రం రూపొందించిన సహయోగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎక్స్ ఇందులో చేరలేదు. కాగా వివాదాస్పద పోస్టులు, ఖాతాల విషయంలో కేంద్రం, ఎక్స్ మధ్య కోర్టులో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోర్టులో ఎక్స్ దాఖలు చేసిన సమాచారం, దానికి ప్రతిస్పందనగా కేంద్రం దాఖలు చేసిన నివేదికలను విశ్లేషించిన రాయిటర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండే పోస్టులను మత విద్వేషాలు రగిల్చే, విభజన తెచ్చేవిగా కేంద్రం పేర్కొన్న విధానాన్ని రాయిటర్స్ కనుగొన్నది.
ఆ పోస్టులు, ఖాతాలను తొలగించండి
- Advertisement -
- Advertisement -