- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై తక్షణమే లోక్‌సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య కోరల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని తీర్మానంలో ఆయన ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి ఢిల్లీ కాలుష్యంపై చర్చ చేపట్టాలని ఢిల్లీ ప్రజలకు సాకులు కాదు, స్వచ్ఛమైన గాలి అవసరమని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.
- Advertisement -


