Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పేలుడు కేసు..జనవరి 26న ప్రధాని ప్రసంగమే టార్గెట్!

ఢిల్లీ పేలుడు కేసు..జనవరి 26న ప్రధాని ప్రసంగమే టార్గెట్!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయగా, దీని వెనుక ఉన్న భారీ ఉగ్రకుట్ర వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పథకం రచించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు ఐదుగురు ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు సూత్రధారులుగా ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

విచారణలో భాగంగా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆస్ప‌త్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్వామాకు చెందిన ఇతడిని విచారించగా కీలక విషయాలు వెలుగుచూశాయి. అధికారులు అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషించగా, అతడు మహమ్మద్ ఉమర్‌తో కలిసి పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలింది. జనవరి 26న ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో అక్కడ భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌కు, ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. డాక్టర్ ముజమ్మిల్ ఫోన్ నుంచి లభించిన ఆధారాలతో ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వారి ప్రణాళికలు ఏమిటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. చదువుకున్న వైద్యులే ఉగ్రవాదం వైపు మళ్లడంపై భద్రతా ఏజెన్సీలు దృష్టి సారించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -