నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 13మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. పేలుడు ధాటికి పలు కారులు కూడా తీవ్రంగా ధ్వంసమైయ్యాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వం లోత్తైన విచారణ కోసం, ఈ దాడిలో కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. దీంతో అసలైన దోషులును గుర్తించడానికి ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 10 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్‌పీలు, డీఎస్‌పీ స్థాయి అధికారులు ఉండనున్నారు. ఈ బృందానికి ఎన్‌ఐఏ ఏడీజీ విజయ్ సఖారే సారధ్యం వహించనున్నారు. దర్యాప్తులో భాగంగా అన్ని కేంద్ర నిఘా సంస్థలతో కలిసి ఈ ప్రత్యేక బృందం ఇన్వెస్టగేషన్ చేయనుంది.
ఢిల్లీ పేలుళ్లు..దర్యాప్తుకు ప్రత్యేక బృందం
- Advertisement -
- Advertisement -



