నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మరో నిందితుని అరెస్ట్ చేశారు. నవంబర్ 10న జరిగిన ఉగ్రవాద దాడికి కొద్దిసేపటి ముందు బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించాడనే ఆరోపణలతో.. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ధౌజ్‌కు చెందిన సోయాబ్‌గా జాతీయ దర్యాస్థ సంస్థ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్ i20 కారులో జరిగిన ఘోరమైన పేలుడుకు సంబంధించిన కేసులో ఇప్పటివరకు తాజా అరెస్ట్ కలిపి ఏడుగురిని అరెస్ట్ చేశారు.
దాడి జరిగిన రోజు నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా అనేక కోణాల్లో NIA విచారిస్తోంది. తాజా అరెస్టు బాంబు దాడి వెనుక ఉన్న కార్యాచరణ నెట్‌వర్క్ గురించి ఏజెన్సీ అవగాహనను బలోపేతం చేసింది. కుట్రతో సంబంధం ఉన్న అదనపు అనుమానితులను గుర్తించడానికి, స్థానిక పోలీసులతో పాటు బహుళ ఆధారాలను ట్రాక్ చేయడం, అనేక రాష్ట్రాలలో సోదాలు నిర్వహిస్తోంది.


