వాటిని ఆమోదించే ప్రక్రియను సమీక్షించండి
క్లినికల్ నిపుణులను సంప్రదించండి
డీసీజీఐకి న్యాయస్థానం ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బరువు తగ్గించే ఔషధాలపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి డ్రగ్ కాంబినేషన్స్‌ను ఆమోదించే ప్రక్రియను సమీక్షించాలని ఢిల్లీ హైకోర్టు.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను కోరింది. భారతదేశానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్, సమర్థత డేటా లేకుండా ఇలాంటి ఔషధాలకు అనుమతులు వస్తున్నాయంటూ జితేంద్ర చౌక్సే అనే వ్యక్తి కోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం పై విధంగా స్పందించింది.
డ్రగ్ కాంబినేషన్స్‌కు అటువంటి ఆమోదాలను నియంత్రించే చట్టపరమైన, నైతిక అంశాల పైనా పిటిషన్ ఆందోళనలను లేవనెత్తింది. ఈ బరువు తగ్గించే డ్రగ్ కాంబినేషన్స్‌కు భారతదేశ నిర్దిష్ట ట్రయల్స్, అధ్యయనాలు, తగిన డేటా ఆధారంగా కాకుండా లైసెన్సులు మంజూరు అవుతున్నాయని పిటిషనర్ ఆందోళనను వ్యక్తం చేశారు. డీసీజీఐ, ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖలకు గతంలో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజా, సమగ్రమైన రిప్రజెంటేషన్‌ను దాఖలు చేయటానికి పిటిషనర్‌కు అనుమతిచ్చింది. ఇందుకు రెండు వారాల సమయాన్ని కేటాయించింది. పిటిషనర్.. డీసీజీఐని సంప్రదించటానికి అనుమతిం చటం సముచితమని తాము భావిస్తున్నట్టు ధర్మా సనం స్పష్టం చేసింది. ఈ అనుబంధ రిప్రజెంటేషన ్‌పై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని డీసీజీఐను హైకోర్టు ఆదేశించింది. రిట్ పిటిషన్‌లో లేవనెత్తిన ఆందోళనలను తగిన విధంగా పరిష్క రించాలనీ, ఇందులో భాగంగా క్లినికల్ నిపుణులు, స్టేకహేోల్డర్లను సంప్రదించాలని తెలిపింది.
భారత్‌లో ఇప్పటికే ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా వెయిట్‌లాస్ డ్రగ్స్‌ను కూడా వాడటం వాడుతారు. అయితే, వెయిట్‌లాస్‌కు సంబంధించి అనేక ఔషధాలు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఇలాంటి డ్రగ్స్ వినియోగానికి సంబంధించి సర్వత్రా చర్చ నడుస్తున్నది.
వెయిట్ లాస్ డ్రగ్స్‌పైఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
- Advertisement -
- Advertisement -