– రూ.11వేల కోట్లతో నిర్మించిన రెండు హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఢిల్లీ ఓ నమూనాగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు గత 11 ఏండ్లుగా తమ ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కృషి చేస్తోందని తెలిపారు. దేశ రాజధానిలో సుమారు రూ.11వేల కోట్లతో నిర్మించిన రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. వీటితో ఢిల్లీ, సమీప ప్రాంత ప్రజలకు ఈ రహదారులు ఎంతో సౌలభ్యంగా ఉంటాయన్నారు. ”అధునాతన కనెక్టివిటీ పొందిన ఢిల్లీ ప్రజలకు అభినందనలు. ప్రపంచం భారత్‌పై ఓ అభిప్రాయానికి రావాలనుకున్నప్పుడు తొలుత దాని చూపు రాజధాని వైపు ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశానికి ఢిల్లీని ఓ నమూనాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ప్రభుత్వం అనేక స్థాయిల్లో కృషి చేస్తోంది. గడిచిన 11 ఏండ్లలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రయాణం సులభతరమైంది” అని ప్రధాని మోడీ వివరించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు సమీప ప్రాంతాలకు ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ రెండు కొత్త ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే సోనిపత్, రోV్‌ాతక్, బహదూర్‌గఢ్‌తో పాటు గురుగ్రామ్ నుంచి ఐజీఐ ఎయిర్‌పోర్టు వరకు ప్రయాణం సులభమవుతుందన్నారు.
వికసిత్ భారత్‌కు ఢిల్లీ ఓ నమూనా
- Advertisement -
- Advertisement -