- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లిబియా రాజధాని ట్రిపోలిలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 2011లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా నిలిచిపోయిన నోకియా ఫోన్ల షిప్‌మెంట్ 16 ఏళ్ల తర్వాత డీలర్‌కు చేరింది. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరమే అయినా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల వల్ల ఈ డెలివరీ ఆలస్యమైంది. అప్పట్లో ఆర్డర్ చేసిన ‘మ్యూజిక్ ఎడిషన్’ నోకియా ఫోన్లను చూసి డీలర్ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఇవి వింటేజ్ కలెక్షన్‌గా మారడంతో, కలెక్టర్లలో భారీ డిమాండ్ ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
- Advertisement -



