నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంజుల కు ఐదవ కాన్పు, ఇంటి దగ్గర పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు 108 ఫోన్ చేసి సమాచారం అందించారు. భీంగల్ 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స చేస్తూ కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.
వెంటనే 108 సిబ్బంది ఈఎంటి త్రిషల, పైలట్ రాజయ్య, ఈఆర్సిపి వైద్యుల సలహాల ప్రకారం అక్కడే అంబులెన్స్ లోనే ప్రవసం చేయడంతో మగ బిడ్డకు జన్మించింది. అనంతరం తల్లి, బిడ్డను కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో అంబులెన్స్ లో ప్రసవం చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రి వైద్య సిబ్బంది 108 సిబ్బందిని అభినందించారు.